వార్ మందుపాతర-ఐదుగురు పోలీసులబలి
రాజమండ్రిఃపీపుల్స్ వార్ నక్సలైట్లు అమర్చిన మందుపాతరకు ఆదివారం నాడు ఐదుగురు సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లు దుర్మరణం పాలయ్యారు. తూర్పు గోదావరి జిల్లా మారేడువల్లి ఏజెన్సీ ఏరియాలో వార్ నక్సలైట్లు ఆదివారం నాడు ఓ పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో అడ్డతీగలసి.ఐ, ఎస్.ఐ. తో పాటు ముగ్గురు సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లు, ముగ్గురు సివిల్ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రంపచోడవరం ఆస్పత్రికి చికిత్సకోసం తరలించారు.
ప్రశాంతంగా వుండే తూర్పుగోదావరి జిల్లాలో మందుపాతప సంఘటన జరగడంతో ఆంధ్రరాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.శనివారం రాత్రి నక్సలైట్లు ఓ ఆర్టీసి బస్సును హైజాక్ చేశారు.అందులో ప్రయాణికులను దశలవారీగా విడుదల చేశారు. ఆ తరువాత నక్సలైట్లు మారేడుమిల్లి పోలీస్టేషన్ పై దాడికివిఫలయత్నం చేశారు. పీపుల్స్ వార్ నక్సలైట్లు ఆర్టీసి బస్సును హైజాక్ చేశారనే వార్త తెలిసిన వెంటనే సుమారు 30 మంది సి.ఆర్.పి.ఎఫ్. దళాలు, పోలీసులు రంపచోడవరం నుంచి మారేడుమిల్లికి బయలు దేరారు.
వాస్తవానికి పోలీసులను ఏజెన్సీ ప్రాంతం లోపలికి రప్పించేందుకు నక్సలైట్లు వ్యూహం పన్నారని చెప్పుకోవాలి. ఆర్టీసీ బస్సు హైజాక్‌అయిందనే ఆతృతతో మారేడుమిల్లి వెళుతున్న పోలీసులు వాహనం మందుపాతర బారిన పడింది. ఐదుగురు సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లు అక్కడికక్కడే మరణించారు
ఈ వార్త తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లుఒరిస్సా, బీహార్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. శక్తివంతమైన పేలుడు సంభవించడంతో జవాన్ల శరీరభాగాలు చెల్లా చెదురుగా పడ్డాయి.












Click it and Unblock the Notifications