ఐ.టి పురోగతికి మహాజన్ రష్యా యాత్ర
న్యూఢిల్లీః ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాల్లో రష్యాల్లో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత ఐ.టి. మంత్రి ప్రమోద్ మహాజన్ సోమవారం మాస్కో చేరుకుంటారు. నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ఐ.టి, టెలికమ్యూనికేషన్ల మంత్రిఅయిన మహాజన్ 27 మంది ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మాస్కో బయలుదేరారు. భారత ఐ.టి. మంత్రి రష్యాలో పర్యటించడం ఇదే ప్రథమం.
రష్యా ఐ.టి. మంత్రి లియోనిడ్ రీమాన్ ఆహ్వానం మేరకు భారత్ బృందం రష్యాలో పర్యటించనుంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి, టెలికాం కంపెనీలకు చెందినసి.ఇ.ఓ. లు కూడా మంత్రి వెంట రష్యాలో పర్యటిస్తారు. పోస్టల్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో పరస్పరం సహకరించుకొనేందుకు భారత్ రష్యాలు గత ఏడాదిఅక్టోబర్ లో రష్యా ప్రధాని పుతన్ భారత్ పర్యట సందర్భంగా ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పరస్పర సహకారంతో ఎంతో అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయని ఉభయ దేశాలు భావిస్తున్న తరుణంలో ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ లో ప్రధాని వాజ్‌పేయి కూడా రష్యా పర్యటించనున్నారు. రష్యా ఇటీవల కాలంలో ఐ.టి. రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా హార్డ్ వేర్ రంగంలో రష్యా పురోగమిస్తున్నది. మహాజన్ పర్యటన ఐ.టి., టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి రష్యా సహకారాన్ని పొందేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications