అక్కాచెల్లెళ్ళ పోరులోవిజేత వీనస్
న్యూయార్క్‌ఃవీనస్ విలియమ్స్ వరుసగా రెండో సారి అమెరికా ఓపెన్ టెన్నిస్ టైటిల్ గెలుచుకుంది. తన సోదరిసెరినాను 6-2, 6-4 స్కోరుతో సునాయాసంగా ఓడించి 1884 తరువాత ఇద్దరు నల్లజాతి మహిళల మధ్య జరిగిన టైటిల్ పోరులోవిజయం సాధించింది.
నాలుగో సీడ్ అయిన వీనస్ విలియమ్స్ కు ఆమె సోదరి, 10వ ర్యాంకర్‌సెరినాకు శనివారం రాత్రి టైటిల్ పోరు జరిగింది. అమెరికా ఓపెన్ టెన్నిస్ మహిళలఫైనల్స్ పైరు అక్కాచెల్లెళ్ళ మధ్య జరగడంవిశేషం.
ఆటలో మొదటి నుంచివీనస్ దే పైచేయి అయింది. వరుస సెట్లలో వీనస్ గెలుపొందడం ఆట తీరు తెలియ చేస్తుంది. ఈ టైటిల్ నుఅక్క గెలుచుకున్నందుకు తనకు ఎంతో ఆనందంగా వున్నదనిసెరీనా చెప్పగా, చెల్లులు ఈ టైటిల్ గెలుచుకుంటే చాలా ఆనందపడే దానిననివీనస్ చెప్పుకుంది.
ఈ మ్యాచ్ కు ముందు అమెరికా పాప్ సింగర్లు దేశభక్తి పూరిత గీతాలను అలపించి టెన్నిస్ ప్రియులను అలరించారు. భారీ అమెరికా పతాకాన్ని ఎగరవేస్తూ సాగిన ఈ కార్యక్రమం కన్నులపండువగా వుంది. పరుషులఫైనల్ లో పీట్ సాంప్రాస్ ఆస్ట్రేలియాకు చెందిన హెవిట్ మధ్య ఆదివారం రాత్రి జరుగుతుంది.












Click it and Unblock the Notifications