దేశం సానుభూతి జిమ్మిక్స్‌ః ఎమ్మెస్సార్
విజయవాడః సానుభూతి కోసం ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని దివంగత ఎమ్మెల్ల్యేల భార్యలకు టిక్కెట్లు ఇచ్చే సంప్రదాయం మంచిది కాదని పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అభిప్రాయపడ్డారు. కేవలం సానుభూతి ఓట్లపై గెలిచేందుకే తెలుగుదేశం పార్టీ ఉయ్యూరు ఉపఎన్నికలో దివంగత అన్నేబాబూరావు సతీమణికి టికెట్ ఇచ్చిందన్నారు.
రాజకీయ పరిజ్ఞానం వున్న వారసులకు టికెట్ ఇవ్వడంలో తప్పులేదని అయితే గెలుపే ప్రధానంగా వ్యవహరిస్తేఅసెంబ్లీ అనుభవశూన్యులతో నిండిపోతుందని ఎమ్మెస్సార్ వ్యాఖ్యానించారు.
ఉయ్యూరులో ప్రచారం చేసేందుకు వచ్చిన ఎమ్మెస్సార్‌విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఉయ్యూరు ఉపఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముక్కుసూటిగా మాట్లాడే ఎమ్మెస్సార్ మరోవివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు. ఇటీవల ప్రకటించిన పిసిసి కార్యవర్గం తనకు సంతృప్తి కరంగా లేదన్నారు.












Click it and Unblock the Notifications