vastu tips: వాస్తు ప్రకారం అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఏ షేప్‌లో ఉండాలి?

కొత్తగా ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసేటప్పుడు సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ చూసే ప్రధానమైన అంశం 'వాస్తు'. అయితే, ఈ మధ్య కాలంలో వాస్తు నియమాలపై రకరకాల ప్రచారాలు, అపోహలు సామాన్యులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ల ఆకారం విషయంలో చాలా మంది స్నేహితులు, బంధువులు ఇచ్చే సలహాల వల్ల లేనిపోని అనుమానాలు తలెత్తుతుంటాయి.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్క పెంచండి చాలు
వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్క పెంచండి చాలు

చతురస్రం, దీర్ఘచతురస్రం.. వాస్తు పరంగా అత్యుత్తమం!

మీ అపార్ట్‌మెంట్ లేదా ఫ్లాట్ చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారం లో ఉంటే అది వాస్తు పరంగా అత్యంత శుభప్రదం. చాలా మంది చతురస్రాకారంలో ఉండకూడదని చెప్పే మాటల్లో అస్సలు నిజం లేదు. వాస్తు నియమాల ప్రకారం ఇల్లు, అపార్ట్‌మెంట్, ఆఫీస్ లేదా వ్యాపార సముదాయం... ఏదైనా సరే ఈ రెండు ఆకారాల్లో ఉండటమే శ్రేయస్కరం. చతురస్రాకారంలో ఉండే స్థలాలు లేదా నిర్మాణాల్లో 'వాస్తు పురుషుడు' పరిపూర్ణంగా కొలువై ఉంటాడని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి ఆకారాలు ఉన్న ఇళ్లలో సూర్యరశ్మి, గాలి సమానంగా వ్యాపించి, సకల శక్తి వనరులు సమతుల్యంగా ఉంటాయి. చతురస్ర, దీర్ఘచతురస్ర ఆకారాలు ఉన్న ఇళ్లలో నివసించే వారికి మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక వృద్ధి, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి.

Vastu tips According to the Principles what shape should an apartment flat be

ఎలాంటి ఆకారాలు ఉంటే మంచిది కాదు?

ఇల్లు కొనేటప్పుడు కొన్ని రకాల ఆకారాల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. మూడు మూలలు ఉండే త్రిభుజాకార ఫ్లాట్లు లేదా ఇళ్లలో అస్సలు నివసించకూడదు. ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఇళ్లలో కొన్ని మూలలు అనవసరంగా పెరగడం లేదా కట్ అవ్వడం (ఈశాన్యం మినహా మిగిలిన మూలలు పెరగడం) మంచిది కాదు. ముఖ్యంగా నైరుతి, ఆగ్నేయం, వాయువ్య మూలలు కట్ అయి ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఎల్-షేప్ లేదా యూ-షేప్ లో ఉండే ఫ్లాట్ల విషయంలో కూడా నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.

vastu tips: పేరు మార్పు వల్ల వాస్తు మొత్తం అనుకూలంగా మారుతుందా?
vastu tips: పేరు మార్పు వల్ల వాస్తు మొత్తం అనుకూలంగా మారుతుందా?

అపార్ట్‌మెంట్ కొనేటప్పుడు గమనించాల్సిన వాస్తు సూత్రాలు

కేవలం ఫ్లాట్ ఆకారమే కాకుండా, అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసేటప్పుడు ఈ కింది అంశాలను కూడా పరిశీలించాలి: ఫ్లాట్ యొక్క ముఖ్య ద్వారం తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య దిశల్లో ఉండటం ఉత్తమం. అపార్ట్‌మెంట్‌లో వంటగది ఆగ్నేయ మూల లో ఉండాలి. ఒకవేళ వీలు కాకపోతే వాయువ్యంలోనైనా ఉండవచ్చు.ఇంటి యజమాని పడుకునే గది ఎల్లప్పుడూ నైరుతి మూలలోనే ఉండాలి. ఇది స్థిరత్వాన్ని ఇస్తుంది.

ఈశాన్య మూల ఎప్పుడూ ఖాళీగా, తేలికగా, శుభ్రంగా ఉండాలి. అక్కడ ఎలాంటి భారీ వస్తువులు లేదా అటాచ్డ్ టాయిలెట్లు ఉండకూడదు. మీ అపార్ట్‌మెంట్ చతురస్రాకారంలో ఉంటే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా సంతోషంగా గృహప్రవేశం చేయవచ్చు. ఇతరులు చెప్పే కల్పిత వాస్తు అపోహలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిర్మాణ ఆకారం సరిగ్గా ఉన్నప్పుడు, అంతర్గత వాస్తు కూడా బాగుంటే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+