నీళ్ళ ప్రైవేటుపై కత్తికట్టిన కాంగ్రెస్
హైదరాబాద్‌ః మెట్రో వాటర్ వర్క్స్ ప్రైవేటీకరణ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ నగరశాఖ సోమవారం ధర్నా నిర్వహించింది. మెట్రోవాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. నీటి ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం ఈ కుట్రపన్నుతున్నదని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.
ప్రైవేటీకరణ ప్రతిపాదనవిరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోలన చేపడతామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఇప్పటికే భారీగా నీటి చార్జీలుపెంచిన ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో మరింతగా ఛార్జీలు వడ్డించేందుకు వ్యూహం పన్నుతున్నదని వారు దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications