లారీ బోల్తాః ఐదుగురి మృతి
ఏలూరుః పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొప్పల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. తాడేపల్లి గూడెం నుంచి వస్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు మరణించారు.
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications