యుపిలో 102మంది ఎమ్మెల్ల్యేల రాజీనామా

లక్నోః ఉత్తరప్రదేశ్‌ లో రాజకీయం అనూహ్యమైన మలుపు తిరిగింది. ములాయం సింగ్‌ యాదవ్‌ సారధ్యంలోని సమాజ్‌ వాద్‌ పార్టీకి చెందిన 102 మంది ఎమ్మెల్ల్యేలు మంగళవారం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వచ్చే మార్చి వరకు పదవిలో కొనసాగేందుకు తనకు అధికారం వున్నదంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రకటించి 24 గంటలు గడవక ముందే త్వరలో ఎన్నికలు జరిపేందుకు ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో సమాజ్‌ వాది పార్టీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

సమాజ్‌ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మంగళవారం లక్నోలోవిలేకరులతో మాట్లాడుతూ ఈ సంచనల నిర్ణయాన్ని ప్రకటించారు.అక్టోబర్‌ లోగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించకపోతేపెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గడవు ముగిసినా అధికారంలో కొనసాగి తన పార్టీవిజయావకాశాలను మెరుగుపరుచుకొనేందుకు ముఖ్యమంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ కుట్రపన్నుతున్నారని ములాయంవిమర్శించారు. రాజ్‌ నాధ్‌ సింగ్‌ మరికొన్ని నెలలు అధికారంలో వుంటే రాష్ట్రంలో బిజెపిపూర్వవైభవాన్ని సంతరించుకుంటుందనే ఉద్దేశ్యంతో సమాజ్‌ వాది పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని భావిస్తున్నారు.

రామ జన్మభూమి వివాదాన్ని మళ్ళీ తెరమీదకు తీసుకరావడంతో పాటు రోజుకో ఆకర్షణీయ పథకాన్ని ప్రకటిస్తూ ప్రజల్ని ఆకట్టుకొనేందుకు రాజ్‌ నాధ్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. సమాజ్‌ వాది పార్టీ తీసుకున్న హఠాత్‌ నిర్ణయంతో బిజెపి మరే వ్యూహం అనుసరిస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+