రెవిన్యూ సమ్మెతో స్తంభించిన కలెక్టరేట్లు
హైదరాబాద్‌ః సోమవారం అర్థరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 వేల మంది రెవిన్యూ సిబ్బంది సమ్మెకు దిగారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల్లో పనులు స్తంభించి పోయాయి.విశాఖలో రక్షణ శాఖ భూ కుంభకోణంలో అన్యాయంగా సస్పెండ్ చేసిన రెవిన్యూ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూవీరు సమ్మెకు దిగారు.
ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట, కలెక్టరేట్ల ముందు, సచివాలయం ఎదుట రెవిన్యూ సిబ్బంది ప్రదర్శనలు జరిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె ఆపేది లేదని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తూ కావలని తాము సమ్మె చేసే పరిస్థితులు కల్పించిందని రెవిన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న తరుణంలో కీలకమైన రెవిన్యూ సిబ్బంది సమ్మెకు దిగడం తగదని రెవిన్యూ శాక మంత్రిఅశోక గజపతి రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులనుకోరారు. వీరి విజ్ఞప్తి మేరకే ఇటీవల తలపెట్టిన సమ్మె మానుకున్నామని,అయినా తమ కోర్కెలను వారి పెడచెవిన పెట్టారని ఆరోపిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. సమ్మెకాలంలో పౌరసరఫరాలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.












Click it and Unblock the Notifications