లాడెన్ అప్పగింతకు విముఖత
కాబూల్‌ఃఉపఖండంలో చివరకు యుద్ధమే అనివార్యంఅయ్యేట్టుగా కనిపిస్తున్నది. లాడెన్ విషయంలోతాలిబన్లు మొండిపట్టుదలతో వున్నారు. వారివైఖరిని బట్టి చూస్తే లాడెన్‌ను అమెరికాకుఅప్పగించడానికి వారెంతమాత్రం సిద్ధంగాలేరు. ఇదే విషయం తాలిబన్ల సుప్రీంకమాండర్ ముల్లా ఒమర్ బుధవారంనాడు స్పష్టం చేశారు. అమెరికాపై దాడుల్లోలాడెన్ హస్తం ఎంతమాత్రం లేదనిఅంతటి శక్తి సామర్ధ్యాలు ఆయన వద్దలేవని వారు అంటున్నారు.
లాడెన్ హస్తం వున్నట్టుగాబలమైన ఆధారాలు చూపిస్తే ఆయన్ను తాముతటస్థ దేశానికి అప్పగిస్తామని వారు అంటున్నారు.అదికూడా మత గురువుల సమావేశం నిర్ణయిస్తుందనితాలిబన్లు చెబుతున్నారు. మరోవైపుబుధవారం నాడు ప్రారంభమైనఉలేమాల సమావేశం అమెరికా డిమాండ్‌పైఏమీ తేల్చకుండా గురువారానికి వాయిదా పడింది. ఈసమావేశానికి 1000 మంది మతగురువులుహాజరయ్యారు.
అనధికార వార్తల ప్రకారంఉలేమాల్లో అత్యధికులు లాడెన్‌ను అప్పగించాలన్నప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టుగాతెలిసింది. ఇదిలా వుండగా న్యూయార్క్‌లోనిఐక్యరాజ్య సమితి భద్రతామండలిసమావేశం సైతం బేషరతుగా లాడెన్‌ను అప్పగించాలనిఅఎn్గానిస్తాన్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలువెలువడిన కొన్ని గంటల్లోనే ముల్లాఒమర్, లాడెన్ అప్పగించడానికి తాము సిద్ధంగాలేమంటూ ప్రకటించారు.












Click it and Unblock the Notifications