దాడులు: ముగ్గురిపై అభియోగాలు
వాషింగ్టన్: వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన టెర్రరిస్టు దాడుల విషయంలో అమెరికా దర్యాప్తు బృందం ప్రగతి సాధించింది. ముగ్గురిపై క్రిమినల్ అభియోగాలుమోపింది. ఇప్పటి వరకు 75 మందిని అదుపులోకి తీసుకుంది. ఈ నెల 11వ తేదీన దాడులకు ఉపయోగించిన నాలుగు విమానాలనే కాకుండా మరిన్ని విమానాలను హైజాక్ చేసి మరిన్ని దాడులు జరిపేందుకు కుట్ర జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 22వ తేదీన మరిన్ని దాడులు చేసేందుకు పథకం రూపొందించుకున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
అమెరికాలో దాడులకు టెర్రరిస్టులు1199 నుంచే పథకాలు సిద్ధం చేసుకున్నట్లు తేలింది. టెర్రరిస్టుల అమెరికా మిత్ర దేశాలైన ఈజిప్టు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ నుంచి చొరబడినట్లు పరిశోధనల ద్వారా దర్యాప్తు బృందం కనిపెట్టింది. తమ మిత్ర దేశాల ద్వారా దేశంలోకి ప్రవేశించిడం వారికిసులువైనట్లు భావిస్తున్నారు. ఈ స్థితిలో పలు కీలక ప్రాంతాల్లో అమెరికా అధికారులు కన్నేసి వుంచారు.
ఇదిలా వుండగా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. యాభై వేల టన్నుల శిథిలాలను తొలగించారు. ఇప్పటి వరకు 218 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 152 మృత దేహాలను గుర్తించారు.












Click it and Unblock the Notifications