కోట్ల ఆరోగ్యం కాస్తా మెరుగు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కోట్లవిజయభాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కాస్తా మెరుగు పడింది. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం కాస్తా మెరుగు పడినట్లు ధృవీకరించారు. ఆయన మంగళవారం ఉదయం కోమాలోకి వెళ్లిపోయినవిషయం తెలిసిందే. దీంతో ఆయనను అపోలో అస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. మెకానికల్ వెంటిలేటర్ అమర్చి ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పిటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చింది.
ఆయన బుధవారం నాడు కోమా నుంచి బయట పడ్డారు. మెకానికల్ వెంటలేటర్ సపోర్ట్ తీసివేశారు.విజయభాస్కర్ రెడ్డి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు.
రాష్ట్ర గవర్నర్ సి. రంగరాజన్ బుధవారంనాడు ఆస్పత్రికి వెళ్లివిజయభాస్కర్ రెడ్డిని పరామర్శించారు. ఆస్పత్రి కోట్ల బంధువులతో, అభిమానులతో నిండిపోయింది.












Click it and Unblock the Notifications