నరేంద్రపైబిజెపి సస్పెన్షన్ వేటు
హైదరాబాద్‌ః బిజెపి సీనియర్ నేత నరేంద్రనుపార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి సస్పెండ్‌చేస్తున్నట్టుగా బిజెపి నాయకత్వంప్రకటించింది. ప్రత్యేక తెలంగాణా ఫోరంఏర్పాటుతో పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించిన నరేంద్ర,ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డిపై పార్టీనేతలు ఆగ్రహంతో వున్న విషయం విదితమే.ఇదిలా వుండిగా హైదరాబాద్‌లోరవీంధ్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగినతెలంగాణా ఫోరం సమావేశంలో నరేంద్రమాట్లాడుతూ, ప్రజాస్వామిక పద్దతుల్లో తాముప్రత్యేక తెలంగాణాను సాధించి తీరుతామనిచెప్పారు. బిజెపి అధిష్టానం వైఖరి ఆయనతీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్‌లోపాతబస్తీనుంచి ఇందిరాపార్క్ వరకు భారీఎత్తున ర్యాలీని నరేంద్ర సారథ్యంలోతెలంగాణా ఫోరం నేతలు నిర్వహించారు. ఈసందర్భంగా తాము తెలంగాణా సాధన సమితి పేరుతోప్రత్యేక ఫోరంను ఏర్పాటు చేస్తున్నట్టుగా నరేంద్రప్రకటించారు. ఇప్పటినుంచి తెలంగాణా రాష్ట్రసాధనకు పూర్తి స్థాయిలో ఉద్యమంచేపట్టనున్నట్టుగా రవీంధ్రనాథ్‌రెడ్డి, నరేంద్రప్రకటించారు. ఈ విషయంలో తమతోకలసివచ్చేవారందరి సహకారంతీసుకుంటామని ఆయన చెప్పారు. బిజెపి నుంచితనను సస్పెండ్ చేయడం వల్ల పార్టీకేనష్టమని ఆయన వ్యాఖ్యానించారు. కాకినాడతీర్మానాన్ని తుంగలో తొక్కిన బిజెపితెలుగుదేశం నేత వత్తిడికితలవొగ్గిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications