పోస్టులో సమన్లు: దేవేందర్
హైదరాబాద్: కోర్టు సమన్లను పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా పంపే యోచన చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాలసమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించడమా, ప్రయివేట్ వ్యక్తుల ద్వారా పంపించడమా అనే ఆలోచన కూడా చేస్తున్నామని ఆయన చెప్పారు.
తర్వాత్తర్వాత ఇ-మెయిల్ వంటి ద్వారా కూడా సమన్లు పంపవచ్చునని ఆయన అన్నారు. అయితే దీనికి హైకోర్టు అనుమతి అవసరమని ఆయన చెప్పారు. కోర్టు సమన్లు చేరవేయడానికే 2,500 నుంచి మూడు వేల వరకు పోలీసు సిబ్బందిని వినియోగించాల్సి వస్తోందని, దీని వల్ల మానవ శక్తి వృధా అవుతోందని ఆయన అన్నారు. సమన్లు పంపడానికి ఇతర మార్గాలు అవలంభించి, ఈ పోలీసులను శాంతిభద్రతల పరిరక్షణ వంటి పనులకు వాడుకోవచ్చునని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications