లాడెన్‌ను బేషరతుగాఅప్పగించాలి: యుఎన్
వాషింగ్టన్: అంతర్జాతీయ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను బేషరతుగా అప్పగించాలని ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి బుధవారం మరోసారి తాలిబాన్లను డిమాండ్ చేసింది. లాడెన్ అప్పగింతకు తాలిబాన్ పెట్టిన షరతులను భద్రతా మండలి త్రోసి పుచ్చింది. తమ 1333వ తీర్మానం మేరకు లాడెన్‌ను బేషరతుగా, తక్షణమే అప్పగించాలని కూడా డిమాండ్ చేసింది.
తీవ్రవాదులను, వారికి సహకరించేవారిని ఎదుర్కుని తీరుతామని అమెరికా ప్రకటించింది. అమెరికాకు ఫ్రాన్స్ తన మద్దతు ప్రకటించింది. ఫ్రాన్స్ అధినేత జాక్విన్ చిరాక్ బుధవారంనాడు వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్‌తో మాట్లాడారు. అయితే, లాడెన్ పట్టుకోవడానికి ఒక దేశంపై యుద్ధం ప్రకటించడాన్ని తాము అంగీకరించబోమని ఫ్రాన్స్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications