నిడమానూరులో ఆరుగురు మృతి
విజయవాడః కృష్ణా జిల్లా కేంద్రమైన విజయవాడ సమీపంలోని నిడమానూరులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో స్రీలు కూడా వున్నారు. వీరంతా మహబూబ్ నగర్ నుంచి పొట్టకూటి కోసం వచ్చి కూలీలుగా పనిచేస్తున్న వారే.
నిడమానూరు సమీపంలోపెద్ద ఎత్తున జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. యధాప్రకారం రోడ్డు వెంట కూలి పనులు చేసుకుంటున్న వారిపైవిజయవాడ నుంచి వస్తున్న ఓ లారీ అదుపు తప్పి డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించారు.
మహబూబ్ నగర్ జిల్లా నుంచి పొట్ట కూటి కోసం వచ్చిన కూలీలు దుర్మరణం పాలు కావడంతో నిడమానూరులోవిషాద ఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications