ఉయ్యూరు, సిద్దిపేటలో భారీ పోలింగ్
హైదరాబాద్‌ః ఉపఎన్నికలు జరుగుతున్న కృష్ణా జిల్లా ఉయ్యూరు, మెదక్ జిల్లా సిద్దిపేట నియోజక వర్గాల్లో గురువారం భారీగా పోలింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగింది. శనివారం నాడు ఈ రెండు నియోజక వర్గాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఉయ్యూరులో......
ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఉయ్యూరు నియోజక వర్గం ఓటర్లు ఎంతో ఓపికగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజక వర్గం లో 1.24 లక్షల మంది ఓటర్లు వున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాపెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. ఇటీవల మరణించిన అన్నే బాబూ రావు సతీమణి తెలుగుదేశం పార్టీ టికెట్ పై పోటీ చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థిగా పార్థసారధి పోటీలో వున్నారు.
సిద్దిపేటలో......
మెదక్ జిల్లా సిద్దిపేటలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ నియోజక వర్గంలో 1.75 లక్షల మంది ఓటర్లు వున్నారు. ఓటర్లకు నోట్లు పంచుతున్నారంటూ కొందరు టిఆర్‌ఎస్ కార్యకర్తలు బుధవారం నాడు తెలుగుదేశం ఎమ్మెల్ల్యేలపై దాడి చేసిన దృష్ట్యా నియోజకవర్గం అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా కేంద్రాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రసమితి నేత చంద్రశేఖర రావు ఈ నియోజక వర్గం నుంచి సునాయాసంగావిజయం సాధిస్తారని అంచనా.












Click it and Unblock the Notifications