90 మంది భారతీయుల గల్లంతు
న్యూఢిల్లీ: న్యూయార్క్, వాషింగ్టన్‌లలో జరిగిన దాడుల నేపథ్యంలో 364 మంది భారతీయుల్లో 90 మంది జాడ తెలియడం లేదని భారత్ ప్రకటించింది.దాడుల్లో మరణించినవారి కుటుంబ సభ్యుల కోసం ఎయిర్ ఇండియా, ఇండియన్‌రైల్వేలు, ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉచిత ప్రయాణం కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
భారత రాయబారి లేదా అమెరికాలోని కాన్సుల్ జనరల్‌అంగీకారంతో మృతదేహాలను దేశంలోకి అనుమతించనున్నట్లు కూడా చెప్పింది. మృతదేహాలను జాగ్రత్తగా చేరవేయడానికి ఢిల్లీ, బొంబాయిలలో కౌంటర్లు ఏర్పాటు చేశారు.
గాయపడిన, మృతి చెందిన, జాడ తెలియని భారతీయుల సన్నిహిత బంధువులకు తత్కాల్ ఛార్జీలు లేకుండా పాస్‌పోర్టులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలుఅందాయి. న్యూయార్క్ నగర అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన కుటుంబ సహాయ కేంద్రంతో న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications