భారత్ బూచిని చూపిన ముషారఫ్
ఇస్లామాబాద్: భారతదేశం టెర్రరిజంపేరుతో పాకిస్థాన్, ఇస్లాంను అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ అన్నారు. అటు అమెరికా డిమాండ్లు, ఇటు దేశంలోని మత వర్గాల వ్యతిరేకత నేపథ్యంలో ఆయన బుదవారం టివీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.అఎn్ఘానిస్తాన్‌లో పాకిస్థాన్ వ్యతిరేక ప్రభుత్వాన్ని నెలకొల్పడం ద్వారా మనల్ని బలహీన పరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోందనివిమర్శించారు. అమెరికాకు సహాయ సహకారాలుఅందించడంతో ఏ విధమైన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా పాకిస్థాన్ భద్రతకు, దేశఅర్ధిక స్థితికి, అణ్వాయుధాలు, ఇతర కీలక ఆస్తుల పరిరక్షణ, కాశ్మీర్‌అంశాలకు నష్టం చేకూరుతుందని ఆయన అన్నారు.
పాక్‌ను, ఇస్లాంను వ్యతిరేకించే భారత్ అమెరికాకు దగ్గర కావాలని చూస్తోందని ఆయన అన్నారు.అందుకే అఎn్ఘాన్‌పై దాడికి అమెరికాకు అడక ముందే అన్ని రకాల సహాయం చేస్తామని ప్రకటించిందని ఆయన అన్నారు. అమెరికాకు ఇస్లాంపైనా,అఎn్ఘాన్ ప్రజలపైనా ఏ విధమైన ద్వేషమూ లేదని ఆయన చెప్పారు. తమ దేశంలో విధ్వంసం సృష్టించిన కుట్రదారు లాడెన్‌ను పట్టుకోవడమే అమెరికా లక్ష్యమని ఆయన అన్నారు. అతనికి ఆశ్రయం కల్పించిన తాలిబాన్లను కూడా అమెరికా క్షమించదని ముషారఫ్ అన్నారు. ఈ క్లిష్ట సమయంలోసరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications