నరేంద్ర నేతగా టిఎస్‌ఎస్ ఆవిర్భావం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనఏకైక లక్ష్యంగా మెదక్ లోక్‌సభ సభ్యుడు, బిజెపి తిరుగుబాటు నేత ఎ. నరేంద్ర నేతృత్వంలో తెలంగాణ సాధన సమితి (టిఎస్‌ఎస్) ఏర్పడింది. ఈ మేరకు బుధవారం ఇక్కడ జరిగిన సదస్సులో ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. శాంతియుత, ప్రజాస్వామిక పోరాటాల ద్వారా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకునేందుకు కృషి చేస్తామని తీర్మానం చేశారు. కార్యక్రమాల ఖరారు, చేపట్టబోయే కార్యక్రమాల పరిశీలన కోసం ఏర్పాటు చేయబోయేస్టీరింగ్ కమిటీ కన్వీనర్‌గా నరేంద్రను సదస్సు ఏకగ్రీవంగా ఎన్నుకుంది.స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసే బాధ్యతను, నియమించే అధికారాన్ని సదస్సు నరేంద్రకుఅప్పగించింది.
టిఎస్‌ఎస్ ఏర్పాటు బిజెపికి వ్యతిరేకం కాదని, వాజ్‌పేయి తమ నాయకుడని, ఇది ఎవరికీ వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సదస్సు కాదని నరేంద్ర అన్నారు. కాంగ్రెస్ నాయకుడు డి.కె. సమరసింహారెడ్డి, బిజెపి నుంచి సస్పెండ్‌అయిన శాసనసభ్యుడు రావుల రవీంద్రనాథ్ రెడ్డి, మేచినేని కిషన్ రావు ఈ సదస్సులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications