విజయవాడలో కుంభవృష్టి
విజయవాడఃవిజయవాడలో గురువారం నాడు కుంభవృష్టి కురిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వర్షం రెండు గంటల పాటు ఎడతెరిపిలేకుండా కురిసింది. దీనితోవిజయవాడలో జన జీవనం స్తంభించి పోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షానికి ఇద్దరు గల్లంతయినట్లు సమాచారం అందింది.
కుంభవృష్టి కురవడంతో పలు చెట్లు కూలిపోయాయి. ఈసీజన్ లో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే ప్రధమం. జలమయమైన లోతట్టు ప్రాంతాలలో అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications