ఎమ్మెల్ల్యేలను కొట్టినా ఫరవాలేదాః వైఎస్
హైదరాబాద్‌ః సిద్దిపేటలో ఆరుగురు ఎమ్మెల్ల్యేలను, మంత్రిని, ఎం.పి.ని ప్రజలు కొట్టిన విషయాన్ని సభలో చర్చిచమనడంలో తప్పేమిటని సి.ఎల్.పి. నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేటలో డబ్బు పంచుతున్న తెలుగుదేశం పార్టీ నేతలపై తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలు దాడి చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ గురువారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా దానిని స్పీకర్ తిరస్కరించారు.
ఈ వ్యవహారంపై కనీసం చర్చకు కూడా అనుమతించకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు సభను స్తంభింప చేశారు. చివరకు ఈఅంశంపై వివరణ ఇచ్చేందుకు హోం మంత్రి దేవేంద్ర గౌడ్ హామీ ఇవ్వడంతో సభ సజావుగా సాగింది.
ఈ అంశంపై వై.ఎస్. విలేకరులతో మాట్లాడుతూ ఆరుగురుఅసెంబ్లీ సభ్యులను ప్రజలు కొట్టడం ఎంతో కీలకమైనవిషయం అని, ఈ అంశంపై చర్చజరగాలని తమ పార్టీ పట్టుపట్టడంలో తప్పేమిటని ప్రశ్నించారు. సిద్దిపేటలో డబ్బు పంచుతూ తెలుగుదేశం పార్టీ దొరికిపోయిందని ఆయనవిమర్శించారు. రాష్ట్ర ప్రజలే తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయనకోరారు. ఈ వ్యవహారంపై గత్యంతరంలేక స్టేట్ మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వ దిగివచ్చిందని వై.ఎస్. అన్నారు.












Click it and Unblock the Notifications