ఇజ్రాయెల్ సాగుఅసెంబ్లీలో రభస
ముఖ్యమంత్రి చంద్రబాబు తన బంధువులకు కోట్లాది రూపాయలనుఅప్పనంగా ముట్టజెప్పడంతో కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారని దీనివల్ల రాష్ట్రానికి గానీ రైతులకు గానీ వీసమెత్తు కూడా ఉపయోగం లేదని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలకు అధికార పక్షం కూడా ధీటగా స్పందించడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.
ఈ అంశంపై వాయిదా తీర్మానానికి కాంగ్రెస్ ఇచ్చిన నోటీసునుస్పీకర్ ప్రతిభాభారతి తిరస్కరించారు. కుప్పం ప్రాజెక్టుపై తాము సమావేశాల ప్రారంభంలోనే నోటీసు ఇచ్చామని సిఎల్‌పి నేత వైఎస్ చెప్పారు. జీరో అవర్‌లో సుమారు గంటన్నరసేపు దీనిపైనే వాగ్యుద్ధం జరిగింది. స్పీకర్ తమ నోటీసును తిరస్కరించినందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సిఎల్‌పి నేత వైఎస్ నాయకత్వంలో సభనుంచి వాకౌట్ చేశారు.
శాసన సభ సమావేశాల ఆఖరు రోజు అనేక ముఖ్యాంశాలను చేపట్టాల్సివుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు దురుద్దేశ్యంతో ప్రాధాన్యతలేనిఅంశాలను సభలో ప్రవేశపెట్టి సభ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారని హోం మంత్రి దేవేందర్‌గౌడ్ ఆరోపించారు. కాగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో గోడలపైబిన్ లాడెన్ అనుకూల నినాదాలు ప్రత్యక్షమైన సంఘటనపై బిజెపి సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడాస్పీకర్ తిరస్కరించారు. దాంతో వారు కూడా సభనుంచి వాకౌట్ చేయనున్నట్టుగా ప్రకటించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!