సిద్ధిపేటలో టిఆర్‌ఎస్‌విజయభేరి
సిద్ధిపేటః సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో తెలంగాణా రాష్ట్ర సమితి నేత కె చంద్రశేఖర్‌రావు 58 వేల 712 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప తెలుగుదేశ అభ్యర్ధి మారెడ్డి శ్రీనివాసరెడ్డిచిత్తుగా ఓడిపోయారు.
కాంగ్రెస్ అభ్యర్ధి వి హనుమంతరెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. మొత్తం ఓట్లు లక్షా పద్నాలుగువేల ఓట్లు పోల్‌కాగాఅందులు చంద్రశేఖర్‌రావుకు సుమారు 83 వేల ఓట్లు పోలయ్యాయి.అంటే 70 శాతంపైగా ఓట్లు ఆయనకే వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన శనివారం నాడు ప్రతిరౌండ్‌లోను ఆయన ముందున్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించిన కారణంగా ఉదయం 11.30 గంటలకల్లా ఫలితాలను అధికారులు ప్రకటించగలిగారు. సిద్దిపేటలో తెలంగాణాసెంటిమెంట్ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసింది. గతంలో ఈఅసెంబ్లీ స్థానం నుంచి చంద్రశేఖర్‌రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా నాలుగుసార్లు గెలిచారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ప్రారంభించిన తర్వాత నైతికవిలువలను దృష్టిలో వుంచుకుని తెలుగుదేశం పార్టీకి శాసనసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా ఇచ్చారు.
అదే సిద్ధిపేట నుంచి ఆయన ఇప్పుడు టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా ఘనవిజయం సాధించారు. సిద్దిపేటలో టిఆర్‌ఎస్‌విజయం అంతా ఊహిస్తున్నదే అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా డబ్బులు గుమ్మరించి ఆయన అవకాశాలను దెబ్బతీయడానికివిఫల ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ మొదటినుంచి ఈ ఎన్నికలను నాన్‌సీరియస్‌గానే తీసుకున్నది.












Click it and Unblock the Notifications