నువ్వంటే నువ్వన్న దేశం, కాంగ్రెస్‌లు
హైదరాబాద్: శాసనసభ సమావేశాల కాలాన్ని కాంగ్రెస్ వృధా చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అనవసరవిషయాలను తీసుకుని కాంగ్రెస్ కాలయాపన చేసిందని ఆయన తనను కలిసినవిలేకరులతో అన్నారు. ట్రాన్స్‌కో వంటి అత్యంత ముఖ్యమైనవిషయాలపై కాంగ్రెస్ నిర్మాణాత్మక సలహాలు ఇస్తుందని భావించామని, అయితేఅందుకు విరుద్ధంగా కాంగ్రెస్ వాకౌట్ చేసిందని ఆయన అన్నారు. అలాగే ఇజ్రాయిల్ సాంకేతిక నైపుణ్యంతో అమలవుతున్న ప్రాజెక్టు ఎంతో
మంచిదని, దీనిపై కాంగ్రెస్ సరైన సలహాలు ఇవ్వకుండా కాలాన్ని వృధా చేసిందని ఆయన అన్నారు.
అధిక సమయాన్ని తెలుగుదేశం పార్టీయే వాడుకుందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. తాము కాలయాపన చేసిందెక్కడ అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమైనవిషయాలు చర్చకు రాకుండా తెలుగుదేశం చేసిందని ఆయనవిమర్శించారు. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తడానికి తాము కృషి చేశామని ఆయన చెప్పారు. కృషి బ్యాంక్ వ్యవహారం, ఏలేరు స్కామ్‌లు చర్చకు రాకుండా తెలుగుదేశం చేసిందని ఆయన అన్నారు. శాసనసభా సమావేశాలను ప్రభుత్వం కుదిస్తూ పోతోందని, దానికిస్పీకర్ కె. ప్రతిభా భారతి వత్తాసు పలుకుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications