యూరప్‌దేశాల వెనుదన్ను
బ్రసెల్స్‌ః అమెరికా సైనిక చర్యకు యూరోపియన్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 15 యూరప్ దేశాల అధినేతలు శనివారం నాడు బ్రసెల్స్‌లో సమావేశమై అమెరికా యుద్ధ సన్నాహాలకు గట్టి మద్దతు ప్రకటించారు.
మాటలతో మాత్రమే కాకుండా చేతల్లో కూడా అమెరికాకు సంఘీభావం ప్రకటించాలని వారు ఏకగ్రీవంగా నిర్ణయించారు. తమపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునే హక్కు అమెరికాకు వున్నదని యూరప్ దేశాలు ప్రకటించాయి. మూడు గంటల పాటు జరిగిన ఈ ప్రత్యేక సమావేశానికి జర్మనీ అధ్యక్షుడు ఫ్రాన్స్ నేత జాక్వస్‌షిరాక్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ అమెరికా నేత జార్జ్‌బుష్‌తో తాము జరిపిన చర్చలవివరాలను వెల్లడించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన దాడికి అమెరికా వీలున్నంత వరకు ప్రపంచదేశాల మద్దతును సమీకరించాలని యూరప్ దేశాలనేతలు సూచించారు.
యూరప్‌దేశాల దన్ను, ముస్లీం దేశాల్లో అత్యధిక భాగం తమనే సమర్ధిస్తూ వుండటంతో ఇక వేచివుండాల్సిన అవసరం అమెరికాకు లేదని పరిశీలకులుఅంటున్నారు. సమర సన్నాహాల నడుమ కూడా గత పదిరోజుల పాటు వేచివుండటం వ్యూహంలో భాగమేనని వారు అభిప్రాయపడుతున్నారు. గడిచిన పదిరోజుల్లో యావత్ ప్రపంచం, కొన్నిమినహాయింపులతో అఎn్గాన్‌కు వ్యతిరేకంగా అమెరికా వెనకచేరడం నైతికంగా అమెరికా యుద్ధ సన్నాహాలకు బలంచేకూర్చింది.












Click it and Unblock the Notifications