సాక్ష్యాధారాలకు అమెరికా తిరస్కారం
వాషింగ్టన్‌ః న్యూయార్క్, పెంటగాన్‌లో జరిగిన టెర్రరిస్టుల దాడుల వెనక ఒసామా బిన్ లాడెన్ హస్తం వున్నదని రుజువు చేసే సాక్ష్యాధారాలు చూపాల్సిందిగా అఎn్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
సాక్ష్యాలు, ఆధారాల ఊసేత్తకుండా బేషరతుగా లాడెన్‌ను తమకుఅప్పగిస్తేనే తాలిబన్ల మర్యాద దక్కుతుందని అమెరికావిస్పష్టంగా ప్రకటించింది. లేదంటే తాలిబన్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సివుంటుందని అమెరికా స్పష్టం చేసింది. తాలిబన్ నేతలువినాశకాలే విపరీత బుద్ధి అన్న ధోరణతి ప్రవర్తిస్తున్నారని అమెరికా హెచ్చరించింది.
లాడెన్‌ను అమెరికాపై జరిగిన దాడులకు ప్రధాన కారకునిగా అమెరికా భావిస్తున్నదని వైట్‌హౌస్ ప్రతినిధి చెప్పారు. తాలిబన్ ప్రభుత్వాన్ని కూల్చడం అమెరికా ఉద్దేశ్యం కానీ లక్ష్యం కానీ కాదని, అయితే అమెరికా పౌరుల భద్రత దృష్ట్యా, టెర్రరిజాన్ని నిర్మూలించడానికి అలా చేయడం తప్పనిసరైతే మాత్రం తాము తమ ఉద్దేశ్యాన్ని మార్చుకోక తప్పదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications