వరదలో చిక్కిన బస్సు-30 మంది క్షేమం
కర్నూలు: బళ్లారి- కర్నూలు రహదారిపై ఒక బస్సు వరదలో చిక్కుకుపోయింది.అందులో 30 మంది ప్రయాణికులున్నారు. పోలీసుల,అగ్నిమాపకదళ సిబ్బంది, ప్రజల సహకారంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు వరదలో చిక్కుకుని పోవడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలోపెట్టుకున్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి సెల్‌ఫోన్ సాయంతో ఈవిషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దాంతో పోలీసులుఅగ్నిమాపక దళం సిబ్బందితో రంగంలోకి దిగారు. నిచ్చెనల సహాయంతో స్థానికుల సహకారంతో ఒక్కరొక్కరే బయట పడ్డారు.
వరదలు ఉధృతంగా వస్తుండడంతోపెద్దవాగు పొండిపొర్లుతోంది. దీంతో రహదారిపై రాకపోకలు ఆగిపోయాయి. ఎవరూ వాగు దాటకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. వొక్కిలేరు వాగులో ఒక బాలుడు కొట్టుకుని పోయాడు. ఇది చూసి వాగులోకి దిగిన ఒక మహిళ కూడా వరద ఉధృతికి కొట్టుకుని పోయింది.కడప పట్టణం పూర్తిగా జలమయమైంది. పాఠశాలలకుసెలవు ప్రకటించారు.












Click it and Unblock the Notifications