ఫిట్నెస్ టెస్టులో నెహ్రాఫెయిల్
ముంబాయి: ఎడమ చేతి వాటం మీడియం పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా శనివారం జరిగిన ఫిట్నెస్ టెస్టులోఫెయిలయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరిగే ముక్కోణనపు వన్డే క్రికెట్ పోటీలకు నెహ్రా పనికి రాడని తేల్చారు.
తాను పూర్తి ఆరోగ్యంగానే వున్నానని, ఫిట్నెస్ సమస్యే లేదని నెహ్రా ప్రకటించుకున్నారు. నెహ్రాకు ఫిట్నెస్ సమస్య ఏదీ లేదని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీ కూడా అన్నారు. అయితే, శనివారం జరిగిన ఫిట్నెస్ టెస్టులో నెహ్రాఫెయిలయ్యాడు. నెహ్రా దక్షిణాఫ్రికాలో జరిగే ముక్కోణపు వన్డే పోటీలకు పనికి రాడని భారత క్రికెట్ జట్టు ఫిజియో ఆండ్ర్యూ లీపస్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఫిజిషియన్ డాక్టర్ అనంత్ జోషి తేల్చేశారు.
నెహ్రా పూర్తిగా కోలుకోలేదని ఇటీవల నెహ్రాను, ఇతర బౌలర్లను మద్రాసులోని ఎంఆర్‌ఎఫ్ పేస్ అకాడమీలో పరీక్షించిన డాక్టర్ జోషి చెప్పారు.
నెహ్రా స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకోవాలనేవిషయంపై నేషనల్ సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంటు సభ్యులు ఆదివారంనాడు నిర్ణయం తీసుకుంటారు.












Click it and Unblock the Notifications