విద్యుత్ పై అసెంబ్లీలో వేడి చర్చ
హైదరాబాద్‌ఃవిద్యుత్ చౌర్యం, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై దుడులకు సంబంధించి శనివారం ఆసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.విద్యుత్ చౌర్యం అంటూ ఎ.పి. ట్రాన్స్ కో అధికారులు దాడులు చేస్తున్నారని అయితే సంపన్న వర్గాలను వదిలేసి బడుగుప్రజలకు మాత్రం శిక్షలు వేస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.
కాంగ్రెస్, వామపక్షాలు,ఎం.ఐ.ఎం. ట్రాన్స్ కో పనితీరుపై దుమ్మెత్తి పోశాయి. బడుగు వర్గాలు మాత్రమేవిద్యుత్ చౌర్యం చేస్తున్నారా? విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న సంపన్న వర్గాలను ఎందుకు చూసీ చూడకుండా వదిలేస్తున్నారని ఎం.ఐ.ఎం నాయకుడుఅసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్ల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు.
బడుగు వర్గాలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు వేస్తున్న ప్రభుత్వం సంపన్న వర్గాలతో కుమ్మక్కై వారిపై కేసులు లేకుండా చేస్తున్నారని వామపక్ష నేతలువిమర్శించారు. ఇప్పటికే వంద మంది ట్రాన్స్ కో సిబ్బంది అవినీతి కేసుల్లో సస్పెండ్ అయ్యారంటేట్రాన్స్ కో నిజాయితీని అర్థం చేసుకోవచ్చునని దానం నాగేందర్‌విమర్శించారు.
ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇస్తూట్రాన్స్ కో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న దాడులు సత్ఫలితాలను ఇచ్చాయని అన్నారు. సంస్కరణలు అమలు చేయకపోతేట్రాన్స్ కో రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందని ఆయన అన్నారు. జిల్లాల్లోట్రాన్స్ కో పరితీరును సమీక్షించేందుకు స్థానిక ఎమ్మెల్ల్యేల సారధ్యంలో సలహా సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదన్నారు.ట్రాన్స్ కో సంపన్న వర్గాల కొమ్ము కాస్తున్నదనడంలో నిజం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications