ముగిసిన అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్‌ః ఈ నెల 13న ప్రారంభమైనఅసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం మధ్యాహ్నంతో ముగిశాయి.అసెంబ్లీ సమావేశాలను కేవలం 9 రోజులు జరపడంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మరి కొన్నిరోజులుఅసెంబ్లీ సమవేశాలను పొడిగించాల్సిందిగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్నికోరాయి. అయితే రాష్ట్రంలో కరవు తీవ్రంగా వున్న కారణంగా ఎమ్మెల్ల్యేలంతా రాజధానిలో కాలక్షేపం చేయడంఅర్థ రహితం అని ప్రభుత్వం వాదించింది.
కరవు, కృషి బ్యాంక్ కుంభకోణం, ఏలేరు తదితర కీలకఅంశాలు చర్చించాల్సి వున్నదున అసెంబ్లీ సమావేశాలను కనీసం ఓ వారం పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ డిమాండ్ ను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితో శనివారం మధ్యాహం రెండు గంటలకుఅసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిద పడ్డాయి.
లాఛనంగా కొన్ని బిల్లులు ఆమెదించడ, విద్యుత్, కరవు పై చర్చించడంమినహా ఈ సమావేశాల వల్ల పెద్దగా ఒరిగింది ఏమీలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications