సత్తా చూపేందుకు అమెరికా సిద్ధం
వాషింగ్టన్: తాలిబాన్‌లపై దాడికి అమెరికా తనసేనలను మోహరిస్తోంది. అఎn్ఘాన్‌పై దాడికి అమెరికా అత్యంత శక్తివంతమైనడెల్టా ఫోర్స్‌ను, నైట్ ఫైటర్స్‌ను రంగంలోకి దించుతోంది. 30 వేల మందిని రంగంలోకి దించాలని అమెరికా యోచిస్తోంది. తాలిబాన్ టెర్రరిస్టులు అత్యంత ప్రమాదకరమైన జీవ రసాయానాలను ప్రయోగించవచ్చుననే ఉద్దేశంతో అమెరికా రేంజర్స్‌డెల్టా ఫోర్స్‌ను రంగంలోకి దించుతోంది. వీటి కదలికలను ఆయా విభాగాలకు తప్ప ఇతరులెవరూ పసిగట్టలేరు.
అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్‌ను అప్పగింతకు ఎన్ని హెచ్చరికలు చేసినా తాలిబాన్ లొంగక పోవడంతో అమెరికా తన సత్తా చూపేందుకు సిద్ధమైంది. యుద్ధ నౌకలను సముద్ర తీరంలో మోహరించింది. 200ఫైటర్ విమానాలు సైన్యానికి పహరా కాస్తున్నాయి. ఒసామాబిన్ లాడెన్ అప్పగింతకు తాలిబాన్‌కు తగిన అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాడులు నిర్వహించడంలో జాప్యం చేస్తున్నట్లుపెంటగాన్ ప్రకటించింది. తాలిబాన్‌పై దాడికి అమెరికా వెనుకాడుతోందన్న వార్తలనుపెంటగాన్ ఖండించింది.
అమెరికాకు మద్దతుగా పూర్తి స్థాయిలో దాడుల్లో పాల్గొనాలని ఐరోపా దేశాలు నిర్ణయించాయి.బ్రిటన్ ఇప్పటికే 13 యుద్ధ నౌకలను పంపింది. తాలిబాన్‌తో యునైటెడ్‌అరబ్ ఎమరేట్స్ తన దౌత్య సంబంధాలను తెంపేసుకుంది. ఆయిల్ ఫిల్లింగ్‌తో పాటు అమెరికా కోరితే అన్ని రకాల సహాయం చేస్తామని భారత్ ప్రకటించింది. గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికావిమానాలకు ఆయిల్ ఫిల్లింగ్ చేసిన విషయాన్ని భారతహోంమంత్రి ఎల్.కె. అద్వానీ ఒక టీవి చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేశారు.
ఇదిలా వుంటే, అమెరికాకు సహాయం చేయడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్‌లో భారీ ప్రదర్శన జరిగింది. పాకిస్థాన్‌లో నిరసనపెల్లుబుకుతోంది. ఇప్పటికే ఈ అల్లర్లలో నలుగురు మరణించారు. వందలాది మందిని పోలీసులుఅరెస్టు చేశారు. ప్రతిపక్షాలతో తీవ్రవాద సంస్థలు గొంతు కలిపాయి. కాశ్మీర్‌లో తీవ్రవాద చర్యలు చేపట్టిన పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద సంస్థలు అమెరికాపై పోరుకు సిద్ధమని ప్రకటించాయి. పిలుపు వచ్చిందే తడవుగా తాలిబాన్ తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications