ఉయ్యూరులో దేశంవిజయం
ఉయ్యూరుఃఉయ్యూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి అన్నే విజయలక్ష్మి 17 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా సానుభూతి ఓట్లు బాగా పనిచేశాయి.
దేశం అభ్యర్ధి దివంగత ఎమ్మెల్యే అన్నే బాబురావుఅర్ధాంగి కావడంతో ప్రత్యర్ధి పార్టీల ప్రయత్నాలు ఇక్కడ సానుభూతి పవనాల ముందు పారలేదు. కాంగ్రెస్ తరఫున ఇక్కడ పార్థసారథి పోటీ చేశారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి అన్నే బాబురావు కేవలం వెయ్యిఓట్లస్వల్పమెజార్టీతో గెలిచిన విషయం దృష్టిలోపెట్టుకుంటే సానుభూతి ఓట్ల ప్రభావం అర్ధమవుతుందని కాంగ్రెస్ నేతలుఅంటున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ ఎత్తున డబ్బులు ఖర్చుచేశాయి. డబ్బు, మద్యం వరదలాపారాయి.












Click it and Unblock the Notifications