కాంగ్రెస్‌, లెఫ్ట్‌ వాకౌట్‌

హైదరాబాద్‌ః కృషి బ్యాంక్‌, ఏలేరు కుంభకోణం వంటి కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చించలేక పోయినందుకు నిరసనగా కాంగ్రెస్‌ వామపక్షాలు వాకౌట్‌ చేశాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రతిభా భారతి ప్రకటించడానికి ముందు కాంగ్రెస్‌ నేత వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించిందని విమర్శించారు. కీలకమైన అంశాలను చర్చించకుండా అసెంబ్లీ నిర్వహించడంలో అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలనుస్పీకర్‌ ఏ దశలోనూ పట్టించుకోలేదని, ఏ అంశంపై సమగ్ర చర్చకు, ప్రతిపక్షాలు అభిప్రాయాలు వెల్లడించేందుకుస్పీకర్‌ అనుమతించలేదని రాజశేఖర రెడ్డివిమర్శించారు. మొక్కుబడిగా సమావేశాల వల్ల ప్రజా ధనం వృధా కావడం తప్ప ప్రయోజనం లేదని ఆయన అన్నారు. కీలకఅంశాలు చర్చించే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్‌, వామపక్ష నేతలు సభ వాయిదా పడడానికి ముందు వాకౌట్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+