ఏ క్షణంలోనైనా దాడులు
న్యూఢిల్లీః యుద్ధం అనివార్యమన్న విషయం విస్పష్టంగా తేలిపోవడంతో వైరి పక్షాలు సంపూర్ణంగా సమరసన్నాహాల్లో మునిగిపోయాయి. రానున్న ఆయిదారు రోజుల్లో ఏ ఘడియలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం వుంది.
తమ గగనతలం ఎగురుతున్న ఒక గూఢచారి విమానాన్ని కూల్చివేసినట్టుగా తాలిబన్ల శనివారం నాడు చేసిన ప్రకటనతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పైలెట్ లేకుండా వున్న ఆ విమానం ఏ దేశానికి చెందనతో తాలిబన్లు ప్రకటించలేదు. ఒకటి రెండు రోజుల్లో ఏ ఘడియలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం వుందని అమెరికా తన మిత్రదేశాలకు సూచనప్రాయంగా చెప్పినట్టుగా తెలిసింది. దాడికి అనువుగా అమెరికా ఇప్పటికే తమ త్రివిధ దళాల మొహరింపును పూర్తి చేసింది.
అమెరికా సర్వసైన్యాధ్యక్షుడు మధ్యప్రాచ్యం చేరుకుని వ్యూహరచన ఖరారు చేస్తున్నారు. అఎn్గాన్‌కు ఫిరంగి వేటు దూరంలో అమెరికా బలగాలను మొహరించారు. దాడులకు సంబంధించి ఆదివారం ఉదయం బుష్ ఒక ప్రకటన చేసే అవకాశం వున్నదని అంటున్నారు. భారత్‌కు అమెరికానుంచి అందిన సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం వున్నది. బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్, డెన్మార్క్ ప్రధాని పౌర్ నైరుఫ్ రస్ముసెస్‌లు కూడా పత్రికల వారితో మాట్లాడుతూ దాడులు ప్రారంభం కావడం ఖాయమని చెప్పారు. ఇస్లాం-క్రిస్టియన్ మతాల మధ్య గొడవగా ఈ యుద్ధానికి మతవాదులు రంగు పులమకుండా అమెరికా
జాగ్రత్తగా వ్యవహారిస్తున్నదని పశ్చిమదేశాల నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications