కుప్పం ప్రాజెక్టులో కుంభకోణం
హైదరాబాద్‌ః కుప్పంలో చేపట్టిన ఇజ్రాయెల్ తరహా సాగుకు సంబంధించిన ప్రాజెక్టులో 15 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం
అయ్యాయని సిఎల్‌పి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు.
కుప్పంలోవిఫలమైన ఈ ప్రాజెక్టును స్వార్ధప్రయోజనాలకోసం మరో నాలుగుదేశాలకు విస్తరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ ప్రయత్నాలను కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ఆయన చెప్పారు.
కుప్పం ప్రాజెక్టులో చంద్రబాబు బంధువులు భారీగా లబ్దిపొందారని ఆయనపేర్కొన్నారు. శాసన సభ సమావేశాల ఆరంభనుంచి తాము కుప్పం ప్రాజెక్టు వ్యవహారంపై సభలో చర్చకు నోటీసులు ఇస్తున్నా వాటిని తిరస్కరించారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications