బీహార్‌లో పోలీసు కాల్పులు- నలుగురి మృతి
పాట్నా: ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి చంపినందుకు నిరసన ప్రదర్శన చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు బుధవారం కాల్పులు జరపడంతో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నలుగురు మరణించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగి కుమారుడు గౌతమ్ మృతదేహాన్ని తీసుకోవడానికి మంగళవారం రాత్రిపెద్ద యెత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పాఠశాలకు వెళ్తుండగా గతవారం గౌతమ్ కిడ్నాప్‌నకు గురయ్యాడు.
ఆగ్రహం చెందిన ఆందోళనకారులు ప్రభుత్వ వాహనాన్ని దగ్ధం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. పట్టణంలో కర్ఫ్యూ విధించారు. పోలీసు సూపరింటిండెంట్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకుడు సుశీల్ కుమార్ మోడి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications