అమెరికా దౌత్య కార్యాలయం దగ్ధం
కాబూల్: అమెరికా దౌత్య కార్యాలయ సముదాయంలోని ఖాళీ భవంతులకు వేలాది మంది ఆందోళనకారులు నిప్పంటించారు.అఎn్ఘానిస్థాన్‌పనై అమెరికా సైనిక చర్యకు ప్రయత్నాలు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు అమెరికా దౌత్య కార్యాలయం సముదాయంలోకి ప్రవేశించి కొన్ని కార్లకు నిప్పంటించారు. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అయితే ప్రధాన భవంతికి ఏమీ కాలేదు.
తాలిబాన్ అగ్నిమాపక దళాలు మంటలనార్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆందోళనకారులను అదుపు చేయడానికి తాలిబాన్‌సైనికులు ప్రయత్నిస్తున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్‌లలో దాడుల అనంతరం ప్రారంభమైనసంక్షోభం సందర్భంగా మొదటిసారి కాబూల్‌లో ఇంతపెద్ద యెత్తున నిరసన జ్వాలలు పెల్లుబుకాయి.












Click it and Unblock the Notifications