లాడెన్ తర్వాతేమిగితా టెర్రరిజం
వాషింగ్టన్‌ః అమెరికా దృష్టి అంతా ఇప్పుడు లాడెన్‌పైనే వుంది. లాడెన్ తర్వాతనే తాము మిగితా టెర్రరిజంపై దృష్టి సారిస్తామని అమెరికా స్పష్టం చేసింది.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న ప్రధాని వాజ్‌పేయి భద్రతా వ్యవహారాల సలహాదారుబ్రిజెష్ మిశ్రా మంగళవారం నాడు అమెరికా ప్రభుత్వ నేతలను కలుసుకుని టెర్రరిజంపై పోరులో అమెరికాకు భారత్ దన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికా సారథ్యంలో జట్టుకట్టిన ప్రపంచదేశాల కూటమికి బేషరతుగా మద్దతునిస్తున్నట్టుగా భారత్ ప్రకటించిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఫిలిప్ రీకర్ చెప్పారు. రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగాబ్రిజెష్ మిశ్రా, బుష్ ప్రభుత్వ యంత్రాంగంలోసీనియర్ అధికారులు అనేక మందిని కలుసుకున్నారు. అమెరికా జాతీయ భద్రతావ్యవహారాల సలహాదారు కండోలీజరైస్, రక్షణ శాఖ మంత్రి డోనాల్డ్ రమ్స్‌ఫెల్డ్, ఉపమంత్రి ఉల్ఫోవిట్జ్, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ జోలిక్‌ను ఆయన కలుసుకున్నారు.
మరికొందరుసెనెటర్లతో కూడా ఆయన మంతనాలు జరిపారు. భారత్‌తో సంబంధాలవిషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పు వుండదని అమెరికా నేతలు హామీ ఇచ్చారు. అమెరికా విడుదల చేసిన టెర్రరిస్టు సంస్ధల జాబితా
ప్రధానంగా అల్ ఖైదాతో సంబంధం వున్న సంస్థలకు సంబంధించినదని అమెరికావివరించింది.
ఈ జాబితాకు సంబంధించి భారత్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను అమెరికా పరిగణలోకి తీసుకున్నది. కాశ్మీర్‌విషయం కూడా మిశ్రా ప్రస్తావించగా తమ టాప్ ప్రియారిటీ ప్రస్తుతం లాడెన్ అని లాడెన్ అంతు చూసిన వెంటనే ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపే కార్యక్రమాన్ని అమెరికా చేపడుతుందని వారు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications