శిథిలాల్లో దుర్వాసన
న్యూయార్క్‌ః డబ్లుటిసి పై టెర్రరిస్టుల దాడి జరిగి పదిహేను రోజులు కావస్తున్నది. లక్షలాది టన్నుల శిథిలాలను తొలిగించే బృహత్ కార్యక్రమంలో వున్న సాయ సిబ్బంది ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కుంటున్నారు. శిథిలాల కింద వున్న మృతదేహాలు కుళ్లిపోవడంతో వస్తున్న భయంకరమైన వాసన సహాయ చర్యల కొనసాగింపునకు ప్రధాన అవరోధంగా వున్నట్టుగా వారు చెబుతున్నారు.
ేఇప్పటికే వేలాది టన్నుల శిథిలాలను తరలించినప్పటికా కొండ తరగడం లేదు. వారం రోజుల క్రితమే ఇంకా ఎవరైనా సజీవంగా దొరికే అవకాశంపై ఆశలు వదులుకున్నారు. మృతదేహాలనైనా పక్కకు తీద్దామంటే భరించలేని దుర్వాసన. మరో పక్క డబ్లుటిసి మొండిగోడలను కూలగొట్టే పని కూడా కొనసాగుతున్నది. తాజా లెక్కల ప్రకారం మొత్తం ఏడు వేల మంది మృతులు వున్నట్టుగాఅంచనావేశారు. మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవల్సిందిగా మృతుల బంధువులకు న్యూయార్క్ మేయర్‌విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications