అమెరికా దాడుల్లో పాక్‌పాల్గొనదు
ఇస్లామాబాద్: అఎn్ఘానిస్థాన్‌పైఅమెరికా చేసే ప్రతీకార దాడుల్లో తాము పాలు పంచకోబోమనిపాకిస్థాన్ ప్రకటించింది. తాము ఉగ్రవాదంపైజరిగే పోరులో మాత్రమే పాలుపంచుకుంటామని, ఆఎn్ఘానిస్థాన్‌పై జరిగే యుద్ధంలో పాల్గొనబోమనిపాకిస్థాన్ అధికార ప్రతినిధి రియాజ్ మహ్మద్‌ఖాన్ బుధవారం చెప్పారు. పోరు తీవ్రవాదంపైజరగాలే తప్ప ఒక దేశంపై కాదని ఆయన అన్నారు.అఎn్ఘానిస్థాన్‌కు, ఆ దేశ ప్రజలకు వ్యతిరేకంగాజరిగే పోరులో తాము పాలు పంచుకోమని ఆయన స్పష్టంచేశారు. నార్తర్న్ అలయెన్స్‌కు అమెరికా సాయంచేయడాన్ని పాకిస్థాన్ ఇప్పటికే వ్యతిరేకించింది.
అంతర్జాతీయఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ జాడ తమకుతెలియదని రియాజ్ అన్నారు. పాకిస్థాన్ లాడెన్‌కు సురక్షితం కూడాకాదని రియాజ్ అన్నారు. పాకిస్థాన్‌లో లాడెన్‌కుఆశ్రయం లభించదని ఆయన అన్నారు. అఎn్ఘాన్, పాక్‌ల మధ్య ఉన్న సంబంధాలనుతాము మర్చిపోమని ఆయన అన్నారు.
అమెరికాకు,పాకిస్థాన్‌కు మధ్య విభేదాలు పొడసూపాయనేవార్తలపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. ఊహాజనితవార్తలపై తాను మాట్లాడదల్చుకోలేదని ఆయనఅన్నారు.












Click it and Unblock the Notifications