వెయ్యికోట్లతో నిరంతరంవిద్యుత్‌ః బాబు
న్యూఢిల్లీః ఆంధ్రరాష్ట్రంలో గృహావసరాలకు 24గంటలువిద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా వెయ్యికోట్లతో ఓ వినూత్న పథకాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం కొత్తఢిల్లీ లో చంద్రబాబు నాయుడు కేంద్రవిద్యుత్ శాఖ మంత్రి సురేష్ ప్రభును కలుసుకొని ఈ ప్రాజెక్టు గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టు కోసం గ్రామీణవిద్యుదీకరణ సంస్థ ద్వారా రుణసాయం అందించాల్సిందిగా చంద్రబాబు కేంద్రమంత్రినికోరారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నివేదికను త్వరలో పంపుతామని కూడా చంద్రబాబుసురేష్ ప్రభుకు వివరించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ద్వారా అభిలషణీయమైన స్థాయిలోవిద్యుత్ వినియోగం జరిగేలా చూడడం ఈ ప్రాజెక్టులో భాగం అని చంద్రబాబు కేంద్ర మంత్రికివివరించారు. ఈ తరహా ప్రాజెక్టునే దేశవ్యాప్తంగా ప్రారంభించాలనే యోచనలో వున్నట్లుసురేష్ ప్రభు వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోపైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించాల్సిందిగా చంద్రబాబు ఆయననుకోరారు.
అనంతరం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్.కె.అద్వానీని కలుసుకున్నారు. అమెరికా యుద్ధ సన్నాహాలు, తదితర పరిణామాల గురించి ఇద్దరు నేతలు చర్చించారు.












Click it and Unblock the Notifications