దడదడలాడిన ఇళ్ళు-వీధుల్లోకి ప్రజలు
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమజిల్లాలతో పాటు తమిళనాడు తీరప్రాంతాల్లో మంగళవారం రాత్రి 8.30 నిముషాల సమయంలో భూమి తీవ్రంగా కంపింపించి. ఇళ్ళలోని సామాన్లు నిలువెల్లా కంపించడం ప్రారంభించడంతో ప్రజలు భయభ్రాంతులై వీధుల్లోకి పరుగులు తీశారు.అపార్ట్ మెంట్లలో నివశించే వారు కేకలు వేస్తూ పరుగున కిందకు దిగి వచ్చారు. తిరుపతి తదితర ప్రాంతాల్లో టెలిఫోన్లు మూగబోయాయి. భూకంపం సంభవించిన రెండు గంటల వరకుఅపార్ట్ మెంట్ నివాసులు ఇళ్ళలోకి వెళ్ళేందుకు సైతం భయపడ్డారు.
చిత్తూరు, నగరి, రేణిగుంట, తిరుపతి,శ్రీకాళహస్తి, పాకాల తదితర ప్రాంతాల్లో భూకంపం ప్రభావం వుంది. అనంతపురం జిల్లాలో హిందుపురం తదితర ప్రాంతాలతో పాటు, నెల్లురు, గూడూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో పదిసెకన్ల పాటు భూమి కంపించిందని అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో గత పది నెలల కాలంలో భూప్రకంపనాలు సంభవించడం ఇదే ప్రథమం.












Click it and Unblock the Notifications