తెలంగాణా ఉద్యమానికి మరింత ఊపు
హైదరాబాద్‌ః సిద్ధిపేట నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా భారీ మెజార్టీతో ప్రజలు తనను గెలిపించడానికి ప్రత్యేక తెలంగాణా ఆకాంక్షనే కారణమని టిఆర్‌ఎస్ నేత చంద్రశేఖర్‌రావు చెప్పారు. సిద్ధిపేట విజయమిచ్చిన స్ఫూర్తితో మరింత ఉధృతంగా తెలంగాణా రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణా రాష్ట్రాన్ని సాధించేవరకు తమ ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా వుండగా ఇప్పటికే వివిధ తెలంగాణా జిల్లాల్లో జెడ్‌పిలు తొలి సమావేశంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటును డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయడం తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరుస్తున్నది. తాజాగా కరీంనగర్, మెదక్ జడ్పీలు కూడా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానాలు చేశాయి.












Click it and Unblock the Notifications