వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌ప్రమాదంలో హైదరాబాదీ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః న్యూయార్క్‌ లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో (న్యూయార్క్‌ కాలమానం ప్రకారం) హైదరాబాద్‌ కు చెందిన కొడాలి రాజీవ్‌ దుర్మరణం పాలయ్యారు. ఈవిషయాన్ని ఆయన మిత్రుడు రాంగోపాల్‌ మెయిల్‌ ద్వారా ఇండియా ఇన్ఫోకు తెలిపారు. 9పార్క్‌అపార్ట్‌ మెంట్స్‌ లో వుంటున్న రాజీవ్‌ వేగంగా కారు నడుపుతూ ఎదురుగా నిలిపి వున్న కారును డీ కొట్టారు.సీట్‌ బెల్ట్‌ కూడా కట్టుకోక పోవడంతో ఆయన కారునుంచి ఎగిరి బయట పడిపోయి అక్కడిక్కడే మరణించారు.

గినా కూండ్రట్‌ ఇదే దారిలో కారునడుపుతున్న సమయంలోసెల్‌ ఫోన్‌ వచ్చింది. దానితో ఆమె కారును పక్కన నిలిపి మాట్లాడుతుండగా వేగంగా వచ్చిన రాజీవ్‌ ఆ కారును డీ కొట్టారని పోలీసులు భావిస్తున్నారు.

కారును అత్యంత వేగంగా నడుపుతుండడంతో పాటుసీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడమే రాజీవ్‌ మరణానికి ప్రధాన కారణం అని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 29 ఏళ్ళ గినా కూండ్రట్‌ ను చికిత్స కోసం అల్బెనీ మెడికల్‌సెంటర్‌ కు తరలించారు. ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారును వేగంగా నడపడంతో పాటుసీట్‌ బెల్ట్‌ కూడా కట్టుకోక పోవడమే రాజీవ్‌ మరణానికి కారణంగా చెబుతున్నందున గినాకు ఎటువంటి జరిమానా విధించే అవకాశాలు లేవని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X