క్షేమంగా వచ్చిన చేగుంట ఎస్‌ఐ
సంగారెడ్డి:పీపుల్స్‌వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేశారని భావిస్తున్న మెదక్ జిల్లా చేగుంట సబ్ ఇన్‌స్పెక్టర్ రఘు బుధవారం ఉదయం క్షేమంగా తిరిగి వచ్చారు. ఆయనతో పాటు ఆయన గన్‌మన్ కూడా తిరిగి వచ్చారు. వారిద్దరు బుధవారం ఉదయం పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. మంగళవారం రాత్రి నక్సలైట్ల బారి నుంచి తప్పించుకోవడానికి వారు చెరుకు తోటలో దాక్కున్నారు. అక్కడి నుంచి బుధవారం ఉదయం తిరిగి వచ్చారు.
మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల తిమ్మాయి పల్లి గ్రామం నుంచి మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రఘును నక్సలైట్లు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దౌల్తాబాద్ మండలంలోని జాలగుట్ట వద్ద ఇందూర్ ప్రియాల్ దళం ఉన్నట్లు సమాచారంఅందడంతో రెండు పోలీసు పార్టీలు అటుగా వెళ్లాయి. ఒక పోలీసు పార్టీతో రఘు వెళ్లారు. అయితే ఆయననుపీపుల్స్‌వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేసుకుని పోయారని భావించారు. అయితే, రఘు బుధవారం ఉదయం తిరిగి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు గాలిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications