చేగుంట ఎస్‌ఐ కిడ్నాప్
సంగారెడ్డి: మెదక్ జిల్లా చేగుంట సబ్ ఇన్‌స్పెక్టర్ రఘునుపీపుల్స్‌వార్ నక్సలైట్లు మంగళవారం రాత్రి అపహరించుకుపోయారు. దౌల్తాబాద్ మండలంలోని చెట్ట తిమ్మాయి పల్లి సమీపం నుంచి నక్సలైట్లు ఆయననుఅపహరించుకుపోయారు. ఆయనతో పాటు ఉన్న ఇద్దరు గన్‌మెన్‌ను కూడా నక్సలైట్లు ఆపహరించుకుపోయినట్లు సమాచారం.
దౌల్తాబాద్ మండలంలోని జాలగుట్ట వద్ద ఇందూర్‌ప్రియాళ్ దళం ఉన్నట్లు సమాచారంఅందడంతో సిద్ధిపేట, చేగుంటల నుంచి వేర్వేరు పోలీసు పార్టీలు ఆ ప్రాంతానికి తరలి వెళ్లాయి. చేగుంట నుంచి తరలివెళ్లిన పోలీసు పార్టీతో ఎస్‌ఐ రఘు వెళ్లారు. ఈ కిడ్నాప్‌నకు సంబంధించి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు జిల్లా స్థాయి అధికారులెవ్వరూ నోరువిప్పలేదు. విషయం తెలిసిన వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రామాయంపేట, తూప్రాన్ తదితర ప్రాంతాల నుంచి పోలీసులు దౌల్తాబాద్ ప్రాంతానికి తరలి వెళ్లారు. నక్సలైట్లు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications