విభజించి పాలించనున్న బుష్
వాషింగ్టన్‌ఃసెప్టెంబర్ 11 మారణహోమానికి బాధ్యుడైన ఒసామాబిన్ లాడెన్ ను సజీవంగా లేదా నిర్జీవంగా పట్టుకుంటామని గర్జించిన అమెరికా అధ్యక్షుడు బుష్‌అందుకు కొత్త వ్యూహం అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. లాడెన్ ప్రమేయం పై కొన్ని సాక్ష్యాధారాలతో అమెరికా విదేశాంగ ప్రముఖులు వివిధ దేశాలకు పయనం అయ్యారు. ఈ విధంగా అంతర్జాతీయ మద్దతు, ముఖ్యంగా ముస్లిం దేశాలనుంచి మద్దతు సాధించి ఆఫ్ఘన్ ను ఏకాకి చేసేందుకు బుష్ ప్రయత్నిస్తున్నారు.
మరో వైపు ఆఫ్ఘన్ లో అధికారాన్ని గుప్పెట్లోపెట్టుకున్న తాలిబన్లలో చీలిక తెచ్చి వారిని మరింత బలహీన పరిచేందుకు కూడా బుష్ వ్యూహం పన్నుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ మేరకు ఆయన వేగంగా పావులు కదుపుతున్నారు. మరో వైపు నిన్నటి వరుకు మొండిగా వాదిస్తున్న తాలిబన్లు కూడా బుధవారం బాగా మెత్తబడ్డారు. లాడెన్‌అప్పగించే విషయంలో అమెరికాతో చర్చలకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ కూడా తాలిబన్ల మొండి వైఖరితోవిసిగిపోయి ఆఫ్ఘన్ మాజీ సారధిని చర్చలకు ఆహ్వానించడం తాజా పరిణామం.












Click it and Unblock the Notifications