ఇస్లాం దేశాలతో బ్లెయిర్‌ దౌత్యం

లండన్‌ః అఎn్గాన్‌ పై అమెరికా దాడుల నేపథ్యంలో కతార్‌లోని దోహాలో జరుగుతున్న 56 ఇస్లాం దేశాల సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అఎn్గాన్‌పై అమెరికా దాడులను నేరుగా ఖండించనప్పటికీ ఈ దాడులను ఇస్లాం రాజ్యాలు పూర్తిగా మాత్రం సమర్ధించడం లేదు.

ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యంగా న్యూయార్క్‌ దాడులకు కారణమైన ఒసామాబిన్‌ లాడెన్‌ను అంతం చేయడానికి అమెరికా ఎక్కుపెట్టిన ఈ దాడులు లక్ష్యం ముగిసిన వెంటనే ఆగిపోవాలని ఇస్లాం రాజ్యాలు కోరుతున్నాయి. తత్‌విరుద్ధంగా ఈ దాడులు ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం వున్నదని అమెరికా చేసిన ప్రకటన పట్ల ఇస్లాం రాజ్యాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది.ఇరాక్‌, సూడాన్‌లే అమెరికా దృష్టిలో వుంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికాదెబ్బలకు ఇరాక్‌ కొన ఊపిరితో వుంది. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ,సైనిక వ్యవస్థ సర్వనాశనం అయ్యాయి. రోగాల బారిన పడి వేలాది మంది పసిపిల్లలు మరణిస్తున్నారు. ఇలాంటి స్థితిలోఅఎn్గాన్‌ను దాటి అమెరికా యుద్ధాన్ని విస్తరిస్తే దానిని ఇస్లాంపైకి ఎక్కుపెట్టిన యుద్ధంగానే భావించాల్సివుంటుందనిఅరబ్‌ రాజ్యాలతో సహా ఇస్లాం దేశాలు హెచ్చరిస్తున్నాయి.

ఉగ్రవాదం ఇస్లాం మతానికే అవమానమని ఉగ్రవాదాన్ని తాము ఎప్పుడూ సమర్ధించమని చెబుతూనే వారు ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. ఇస్లాం రాజ్యాలస్వరంలో మార్పును గుర్తించిన అమెరికా పురమాయింపుపైబ్రిటన్‌ ప్రధాని టోనీ బ్లెయిర్‌ దౌత్యం ఈ దేశాలను బుజ్జగించి అమెరికా వైపు తిప్పే బాధ్యత భుజాన వేసుకున్నారు. ఈ మధ్యనే రష్యా, పాకిస్తాన్‌, భారత్‌ పర్యటించి ఆయా దేశాలను అమెరికాకు అనుకూలంగా మల్చిన బ్లెయిర్‌ ఇప్పుడు ఇస్లాం రాజ్యాలనకు కూడా అమెరికాకు అనుకూలంగా మార్చగలననేవిశ్వాసంతో వున్నారు. దోహాలోని ఇస్లాం రాజ్యాల సదస్సు తీసుకునే నిర్ణయాలు వ్యక్తం చేసే అభిప్రాయాల ప్రభావంఅఎn్గాన్‌ యుద్ధానికి సంబంధించి అమెరికా ధోరణిని ప్రభావితం చేసే అవకాశం వుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+