బేటీ బచావో కేవలం నినాదమేనా మోడీజీ : బండి సంజయ్ కొడుకు కేసుపై కేటీఆర్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడుపై లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో సంచలనం గా మారింది. బండి సంజయ్ కొడుకు భగీరథ్ హైదరాబాద్ కు చెందిన మైనర్ బాలికను వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు అయింది. బండి తనయుడి పై నమోదైన పోక్సో కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కకేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బేటీ బచావో అనేది కేవలం ఎన్నికల నినాదమా?
ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలికకు న్యాయం జరగకపోవడం, ఆమెపైనే ఎదురు కేసులు నమోదు చేయడం వంటి అంశాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. "బేటీ బచావో" అనేది కేవలం ఎన్నికల నినాదమా? అని మోదీని నిలదీశారు. కేంద్ర మంత్రి కొడుకుపై చట్టపరమైన చర్యలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని, బండి సంజయ్ నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలన్నారు.

బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. బాధితురాలు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా మూడు నెలలు గడిచినా FIR నమోదు చేయకపోవడం, ఆమెపై హనీ-ట్రాప్, వసూళ్ల కేసులు నమోదు చేయడం వంటి చర్యలను ఖండించారు. రాహుల్ గాంధీ ఉన్నావ్ కేసులో బాధితురాలికి అండగా నిలబడ్డారు కదా, ఇక్కడ ఎందుకు అలా లేరని ప్రశ్నించారు.
బీజేపీ-కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయా?
కేటీఆర్ మాట్లాడుతూ, "ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో బీజేపీ-కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయా?" అని అనుమానం వ్యక్తం చేశారు. బాధిత బాలిక ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినా ఆమెనే నిందించడం దుర్మార్గమని తీవ్రంగా ఆక్షేపించారు.ఈ వ్యవహారం తెలంగాణలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది అని మాజీ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ప్రధాని మోడీ ప్రోగ్రాం నుండి బండి సంజయ్ అవుట్
కాగా రేపు హైదరాబాద్ కు పదాని మోడీ రానున్నారు. ఈ క్రమంలో ఆయన కార్యక్రమానికి కేంద్ర మంత్రి హోదాలో బండి అంజయ్ హాజరు కావాల్సి ఉండగా ఆయనకు ఆహ్వానం అందలేదు,కొడుకు మైనర్ బాలికపై వేధింపుల వ్యవహారం కారణంగా ఆయనకు కేంద్రం షాక్ ఇచ్చిందని చర్చ సాగుతుంది. .













Click it and Unblock the Notifications